సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో ఫుల్ ప్రాజెక్ట్స్ అండ్ హెవీ షెడ్యూల్స్ లో బిజీగా కనిపిస్తుంది. అల్లుఅర్జున్ 'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత సామ్ క్రేజ్ మరింత పెరిగింది. అమెజాన్ ప్రైమ్ బ్లాక్ బస్టర్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' లో నటించిన తర్వాత ఈ బ్యూటీ ఫాలోయింగ్ నార్త్ లో కూడా పెరిగింది. తాజాగా గ్లామర్ క్వీన్ సమంత ఆదిత్య ధర్ దర్శకత్వం వహించనున్న సినిమాలో స్టార్ హీరో విక్కీ కౌశల్‌తో జతకటనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి 'ఇమ్మోర్టల్ అశ్వథామ' టైటిల్ ని లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడి చేయనున్నారు.