బాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ ఆలియాభట్ ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత బాలీవుడ్ కపూర్ వారసుడు, హీరో రణ్ బీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లాడిన ఆలియా రెండ్నెల్లకే గర్భవతి అయ్యింది. ఈ విషయాన్ని గత వారంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
"హార్ట్ ఆఫ్ స్టోన్" తో హాలీవుడ్ డిబట్ ఎంట్రీ ఇస్తున్న ఆలియా ప్రెగ్నన్ట్ ఐన తర్వాత కూడా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొని తన పాత్రకు సంబంధించిన అన్ని పనులను ముగించి, నిన్ననే ఇండియాకు తిరిగొచ్చింది. బేబీ బంప్ తోనే హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీ షూటింగ్ లో పాల్గొన్న ఆలియా ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో క్యూట్ ఆలియా తన చిన్న బేబీ బంప్ తో మరింత క్యూట్ గా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa