టాలీవుడ్ తనకు హోమ్ గ్రౌండ్ లాంటిదని ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు ప్రభుదేవా అన్నారు. ఆయన హీరో గా నటించిన మై డియర్ భూతం చిత్రం ఈ నెల 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం తనకుందని ప్రభుదేవా చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం చిత్ర పరిశ్రమని ఆయన తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com