తనకు స్టార్ ఇమేజ్ ను తీసుకొచ్చిన జబర్దస్త్ కామెడీ షోకు వీడుకోలు పలికి సెన్సేషన్ క్రియేట్ చేసింది యాంకర్ అనసూయా భరద్వాజ్. తాజాగా ఒక డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ చెప్తూ కనిపించింది. ఇంతకు ఏ సినిమా కోసం అనసూయ డబ్బింగ్ చెప్తుoదనుకుంటున్నారా.... కృష్ణవంశీ 21 వ సినిమా "రంగమార్తాండ". ఈ మూవీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ గత వారంలోనే జరగ్గా, అప్పుడే డబ్బింగ్ ఏంటి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
మరాఠీ హిట్ చిత్రం "నటసామ్రాట్" కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఒక కీలక అప్పియరెన్స్ లేదా వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఐతే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.