కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఇటీవలే సుజల్: ది వర్టెక్స్ అనే ఓటిటి వెబ్ సిరీస్ చేసి, సూపర్ హిట్ కొట్టింది. తాజాగా ఆమె లీడ్ రోల్ లో నటించిన డ్రైవర్ జామున్ మూవీ షూటింగ్ పూర్తైనట్టు ప్రకటించింది.
కెన్స్లిన్ డైరెక్షన్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదలవబోతున్న ఈ రోడ్ థ్రిల్లర్ ట్రైలర్ ఇటీవలే విడుదలవగా ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ పూర్తవ్వడంతో, ఇకపై పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరిపి, వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.