రణం, టక్కరి వంటి సినిమాలతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అమ్మా రాజశేఖర్, ఆపై ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. నటుడిగా, డైరెక్టర్ గా కొన్ని సినిమాలు చేసి చెయ్యి కాల్చుకున్న అమ్మ రాజశేఖర్ తాజాగా "హై ఫైవ్" అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను డైరెక్ట్ చేసి, నిర్మించారు కూడా. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హీరో నితిన్ ను చీఫ్ గెస్ట్ గా పిలిస్తే, ఆయన రాలేదని రాజశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
"కెరీర్ తొలినాళ్ళలో నీకు డాన్స్ రాకపోతే నేను నేర్పించాను. గురువుగా నాకు గౌరవమిచ్చి ఈవెంట్ కు వస్తావనుకున్నాను. షూటింగ్ లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నావు కానీ ఈవెంట్ కు హాజరవలేదు. హీరోగా కెరీర్ లో ఒక పొజిషన్ కు చేరుకున్న నువ్వు గురువును అవమానిస్తున్నావు. జీవితంలో మళ్ళీ మనం ఖచ్చితంగా కలిసే తీరతాం. అప్పుడు చూడు ఏం జరుగుతుందో! " అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు. ఈ మేరకు హీరో నితిన్ ను ఒరేయ్ అని సంబోధించడం గమనార్హం.