టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో గ్లామర్ తోనే కాకుండా తన నటనతో అందరి హృదయాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించింది. పా.కిన్స్లిన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి 'డ్రైవర్ జమున' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. మహిళా క్యాబ్ డ్రైవర్ రోజున జరిగే సంఘటనల చుట్టూ ఈ సినిమా వెళ్తుంది అని సమాచారం. తాజాగా ఈరోజు డ్రైవర్ జమున షూటింగ్ మొత్తం పూర్తయిందని అతి త్వరలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత మూవీ టీమ్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. 18 రీల్స్‌పై ఎస్.పి.చౌదరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.