టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ పెట్టారు. మహేష్ సరసన పూజా హెడ్గే నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. తాజా అప్‌డేట్ ప్రకారం, సూపర్ స్టార్ మహేష్ ఈ చిత్రానికి 100 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు అంతేకాకుండా ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరినాటికి ఎలాగైనా ముగించాలని త్రివిక్రమ్ ని అడిగినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.