టాలీవుడ్ ఎవర్ గ్రీన్ కాంబో సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా ఈ ఆగస్టు నుండి ప్రారంభం కాబోతుందని రెండ్రోజుల క్రితమే మేకర్స్ అధికారికంగా ఎనౌన్స్ చేశారు. మాక్జిమం ఆగస్టు రెండవ వారం నుండి షూటింగ్ స్టార్ట్ కావొచ్చని వినికిడి. దీంతో తమ అభిమాన హీరో, ఆయన అభిమాన డైరెక్టర్ తో చెయ్యబోయే సినిమా ఇంకొన్ని రోజుల్లోనే మొదలుకాబోతుందని సూపర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అతడు, ఖలేజా తదుపరి దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత వీరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా కోసం మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ కూడా భారీ పారితోషికాన్ని అందుకోబోతున్నారట. సాధారణంగా సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను, లాభాల్లో వాటా రూపంలో రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకునే మహేష్, ఈ సినిమా కోసం రూ. 75 కోట్ల పే చెక్ ను అందుకోబోతున్నాడట. త్రివిక్రమ్ కూడా తన కెరీర్ లో హై రెమ్యునరేషన్ రూ. 50 కోట్లు ఈ సినిమా కోసం డిమాండ్ చేసాడట.
ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ కాగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మమత ఈ సినిమాను సమర్పిస్తున్నారు.