విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో యంగ్ హీరో నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం "థాంక్యూ". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా టైం తీసుకుంది. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూలై 8న విడుదలవుతుందనుకున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. జులై 22 న థియేటర్లలో సినిమా విడుదలవుతుందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ పై మేకర్స్ సూపర్ అప్డేట్ ఇచ్చారు. జూలై 12వ తేదీ సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు థాంక్యూ మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది?, చీఫ్ గెస్ట్ ఎవరు? అన్న విషయాలపై ఇంకా పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa