ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబులో SVP "మ మ మహేష్" సాంగ్ నయా రికార్డ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 07:10 PM

పరశురామ్ పెట్ల డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం "సర్కారువారిపాట". కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా తమన్ అందించిన పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈ సినిమాలో కళావతి, మ మ మహేష్ పాటలు చార్ట్ బస్టర్ లుగా నిలిచాయి. తాజాగా యూట్యూబులో మ మ మహేష్ పాట వంద మిలియన్ వీక్షణల మార్కును క్రాస్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటూ, స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పాటలో మహేష్, కీర్తిల మాస్ స్టెప్పులు, మ్యూజిక్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేంత హుషారుగా ఉంటాయి. పోతే, ఈ పాటను శ్రీకృష్ణ, జోనితగాంధీ ఆలపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa