MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "మాచర్ల నియోజకవర్గం". శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. మహతీ స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న విడుదలవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాలోని "రా రా రెడ్డి ...ఐయామ్ రెడీ " అనే మాస్ మసాలా పాట లిరికల్ వెర్షన్ ఇటీవలే విడుదలై, యూట్యూబులో దుమ్ము రేపుతోంది. ఈ పాటలో నితిన్, అంజలి కలిసి వేసే మాస్ స్టెప్పులు ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించే విధంగా ఉన్నాయి. ప్రేక్షకులు ఈ పాటపై చూపిస్తున్న ఇంటరెస్ట్ ను మరింత పెంచడానికి మేకర్స్ ఈ సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. ఈ వీడియోకు కూడా ఆడియన్స్ మంచి ఆదరణ చూపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa