ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విడుదల కానున్న ఆది సాయికుమార్ 'తీస్ మార్ ఖాన్' రెండవ టీజర్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 15, 2022, 03:50 PM

కళ్యాణ్ జీ గోగన దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'తీస్ మార్ ఖాన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన గ్లామరస్ దివా పాయల్ రాజ్‌పుత్ జంటగా కనిపించనుంది. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌ ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా రెండవ టీజర్‌ను ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో సునీల్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నా ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa