తాజాగా మీనా తన భర్త గురించి పోస్ట్ పెట్టారు. పెళ్ళి రోజున భర్తను తలచుకుంటూ మీనా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'నువ్వు మాకు దేవుడిచ్చిన అందమైన దీవెనవి. కానీ ఆ దేవుడు నిన్ను చాలా త్వరగా మా నుంచి తీసుకెళ్లాడు. మీరు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారు. కఠిన సమయంలో మా పట్ల ప్రేమ, అప్యాయత చూపించిన ప్రతి ఒక్కరికి నేను, నా కుటుంబం ధన్యవాదాలు తెలుపుతున్నాం’ అని మీనా రాసుకొచ్చింది.