బిగ్ బాస్ ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే హౌస్ లో పోటీ రసవత్తరంగా మారింది. మునిపటితో పోలిస్తే టాస్క్ లు కఠినంగా మారాయి. హౌస్ మేట్స్ గెలవడం కోసం కఠినమైన టాస్క్ లలో పాలుపంచుకుంటున్నారు. సరికొత్త టాస్క్ లతో ఇంటిసభ్యులకు బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. ఈ టాస్క్ లలో ఎవరు గెలుస్తారో వారిని ఫైనల్ ఎపిసోడ్ కు పంపిస్తామంటూ తాజాగా ఊరించాడు.
ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు.. అలాగే ఎలిమినేషన్ కాకుండా ఉండేందుకు తాజాగా ఓ కారు టాస్క్ ను హౌస్ మేట్స్ కు ఇచ్చాడు. ఈ కారు టాస్క్ లో సైరన్ మోగగానే హౌస్ మేట్స్ అంతా గార్డెన్ ఏరియాలో ఉన్న కారులోకి ఎక్కాలి.. మొదట ఎక్కిన ఐదుగురు ఇంటిసభ్యులు ఫైనల్ వీకెండ్ కు వెళతారని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈ ఐదుగురుతోపాటు కారులోకి దూరిన వారిని కన్విన్స్ చేసి వారిని దించేయడానికి ఒప్పించాల్సి ఉంటుంది. చివరకు ఐదుగురు మాత్రమే ఉంటే వారు నేరుగా ఫైనల్స్ కు వెళతారు.. ఇలా 24 గంటల పాటు కారులోనే ఉండాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే తట్టుకోలేక బయటకు వస్తారో వారు నామినేషన్ కు వెళ్తారని చెప్పారు.
ఈ ఆసక్తికర టాస్క్ లో మరో ట్విస్ట్ ఏంటంటే.. 24 గంటలకు మించి కారులో ఐదుగురి కంటే ఎక్కువమంది ఉంటే ఎవ్వరూ ఫైనల్ వీక్ లోకి వెళ్లే చాన్స్ ఉండదు. దీంతో హౌస్ మేట్స్ అందరూ మిగతా వారిని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది.ఎవ్వరూ ఓడిపోవడానికి ఒప్పుకోరు కాబట్టి ఈ టాస్క్ బాగా పేలుతోంది. గొడవలు అలకలు కన్విన్స్ లతో బిగ్ బాస్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో రోల్ రైడా చేసిన పొరపాటుతో అతడు నామినేషన్ లోకి వెళ్లిపోయాడు. కౌశల్ ఈ సీజన్ మొత్తానికి నామినేషన్ లో ఇదివరకే ఖరారు కావడంతో బిగ్ బాస్ అతడిని సంచాలకుడిగా నియమించారు. ఇక రోల్ రైడా బజర్ మోగకముందే కారును టచ్ చేయడంతో నిబంధనల ప్రకారం అతడు ఎలిమినేషన్ కు నామినేట్ అయినట్టు కౌశల్ ప్రకటించాడు. దీనికి రోల్ రైడా ఒప్పుకోలేదు. కౌశల్ తో పెద్ద మాటల యుద్ధమే జరిగింది.
ఇక ఈ కారు టాస్క్ లో తనీష్ - సామ్రాట్ - దీప్తి - శ్యామల - గీతామాధురిలు కారులోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకైతే ఫైనల్ రేసులో ఉన్నారు. మరి వీరు దిగుతారా కారులోనే ఉండి విజేతలుగా నిలుస్తారా అన్నది ఈ రోజు ఎపిసోడ్ లో చూడొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa