టాలీవుడ్ లో మోస్ట్ రీమేక్స్ చేసి సూపర్ హిట్లు కొట్టిన ఒక ఒక హీరో విక్టరీ వెంకటేష్. ఈ మధ్య కాస్తంత నెమ్మదిగా సినిమాలను చేస్తున్న వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్ 3 చేసిన తదుపరి ఏ కొత్త ప్రాజెక్ట్ ను అఫీషియల్గా ఎనౌన్స్ చేయలేదు. అనఫీషియల్గా సల్మాన్ ఖాన్ "కభీ ఈద్ కభీ దివాళి" లో వెంకీ ఒక కీరోల్ లో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.
తాజాగా వెంకటేష్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమాను ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది. జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్ ఇటీవలే వెంకటేష్ ను కలిసి ఒక స్క్రిప్ట్ ను వినిపించారని, అందుకు వెంకీ కూడా పాజిటివ్ గానే స్పందించారని టాక్. ప్రస్తుతం అనుదీప్ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో తెలుగు, తమిళ భాషలలో "ప్రిన్స్" ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల అవుతుంది. వెంకటేష్ తో ప్రాజెక్ట్ కు అన్ని సెట్ ఐతే డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.