ట్యాలెంటెడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇటీవల బ్యాక్ టు బ్యాక్ లేడీ ఓరిటెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు సినిమాలలో ముందుగా విడుదలైన విరాటపర్వం కమర్షియల్ గా సక్సెస్ అవ్వనప్పటికీ సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు, విమర్శకులు జేజేలు పలికారు. తాజాగా విడుదలైన సోషల్ డ్రామా "గార్గి" లో కూడా సాయిపల్లవి అద్భుతమైన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. తెలుగులో ఈ సినిమా సోసోగానే రన్ అవుతున్నా తమిళనాట మంచి స్పందన వస్తుంది. సూర్య నటించి, నిర్మించిన "జైభీమ్" తో ఈ సినిమాను పోల్చడం విశేషం. ఈ సినిమాలో తన నటనకు గాను సాయిపల్లవి జాతీయ అవార్డు అందుకోవడం ఖాయమని అందరు అనుకుంటున్నారు.
కానీ, సాయి పల్లవి పై గతంలో వచ్చిన ఒక అవాంఛిత కాంట్రవర్సీ ఆమెకు నేషనల్ అవార్డును దూరం చేస్తుందేమో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. విరాటపర్వం ప్రమోషన్స్ సమయంలో సాయి పల్లవి చేసిన కొన్ని వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఈ ఇష్యు బాగా పాపులర్ అయ్యింది. ఎంతలా అంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ నాయకులు ఆమెపై కేస్ పెట్టి, కోర్టుకు కూడా లాగారు. ప్రస్తుతానికి ఆ ఇష్యుని అందరు మర్చిపోయినప్పటికీ, దాని ఫలితం సాయి పల్లవి కెరీర్ పై తప్పకుండా ఉంటుందని అంటున్నారు. ఇదంతా సాయిపల్లవి స్వయంకృత అపరాధమని, దానికి ఎవరు ఏమి చేయలేరని, మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, అందులో సాయిపల్లవి విఫలమైందని, అన్ని చోట్ల హానెస్టీ గా ఉండకూడదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.