భారీ అంచనాలు నడుమ విడుదలైన అఖిల్ అక్కినేని "ఏజెంట్" టీజర్ కు ప్రేక్షకుల నుండి, పలువురు సెలెబ్రిటీల నుండి విశేష స్పందన వస్తుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజెంట్ సినిమా కోసం ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్నానని పేర్కొంటూ స్పెషల్ ట్వీట్ చేసారు. ఏజెంట్ టీజర్ స్టన్నింగ్ గా ఉందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, మూవీ థీమ్ తనకు బాగా నచ్చిందని, చెప్తూ, ఏజెంట్ చిత్రబృందానికి శుభాకాంక్షలను తెలియచేసారు.
సురేందర్ రెడ్డి డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి గారు కీలక పాత్రను పోషిస్తున్నారు.