అక్కినేని నాగచైతన్య, రాశిఖన్నా జంటగా, విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో రూపొందిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "థాంక్యూ". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 22వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మేరకు మూవీ టీం గత కొన్ని రోజుల నుండి వరస ప్రచార కార్యక్రమాలను చేస్తూ, సినిమాపై తగిన హైప్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.
ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో హీరో నాగచైతన్య మాట్లాడుతూ... విక్రమ్ గత చిత్రాలు ఇష్క్, మనం, 24 లలో ఒక రకమైన అద్భుతం ఉంటుందని, అలాంటి మ్యాజిక్ థాంక్యూ సినిమాలో కూడా ఉంటుందని, అదే ఈ సినిమా ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు.
ఇంకా ఈ సినిమాలో అవికాగోర్, మాళవిక నాయర్, సాయి సుశాంత్ కీరోల్స్ పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.