బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకొనె తమ సంసార జీవితాన్ని సాఫీగా సాగి స్తున్నారు. ఎవరికి వారు సినిమాలతో బిజీగా గడు పుతున్న పర్సనల్ లైఫ్ కోసం సమయాన్ని కేటాయి స్తున్నారు. జాలీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఈ జంట ఓ సెల్ఫీ ఎక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి జస్ట్ జాయ్' అంటూ కామెంటే పెట్టింది. ఇద్దరు మనస్ఫూర్తిగా నవ్వుతూ హ్యాపీ మూడ్ లో కనిపించారు. ఇక ఇటీవల మొగుడు రణ్ వీర్ సింగ్ పై దీపిక ఓ కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. రణ్ వీర్ నన్ను చాలా ప్రేమగా చూసు కుంటాడు. కానీ చాలా త్వరగా భోజనం పూర్తి చేస్తాడు. నాకేమో కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా భోజనం చేయాలని ఉంటుంది. కానీ... నేను రెండు ముద్దలు తినేలోపు రణ్ వీర్ గబగబా తినేసి పేటు పక్కన పెట్టేస్తాడు. అదే నాకు నచ్చదు అని చెప్పుకొచ్చింది. ఈ స్టార్ కపుల్స్ పై అభిమానులు ఓ కంప్లైంట్ చేస్తున్నారు. నిన్నా మొన్నా ఏళ్లి చేసుకున్న వాళ్ళు "తల్లిదండ్రులం కాబోతున్నాం' అంటూ గుడ్ న్యూస్ చెబుతున్నారు. మరీ. మీరెప్పుడు చెబుతారని అడుగుతున్నారు.