ఇంగ్లీష్ పోరి అమీ జాక్సన్ తమిళ, హిందీ, తెలుగు భాషల్లో దాదాపు 15 సినిమాలు చేసింది. గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సింగ్ ఈజ్ బ్లింగ్, ఎవడు, తేరి, రోబో 2.0 లాంటి హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2.0 తర్వాత మరో సినిమా చేయలేదు. పెళ్లి చేసుకోకుండానే తల్లయింది. 2019లో బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చే పనిలో ఉంది. ఈ క్రమంలో కెమెరా ముందుకొచ్చి హాట్ హాట్ గా పోజులు కొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బీచ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిలో ఈవెనింగ్ టైమ్ లో నిండైన దుస్తుల్లో కనిపిస్తున్న అమీ పిక్ ఒకటి వెరీ స్పెషల్ గా కనిపిస్తుంది. ఇందులో మత్తెక్కించే చూపులతో కవ్విస్తోంది ఇంగ్లీష్ బ్యూటీ. ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం ఎడ్ వెస్ట్విక్ తో డేటింగ్ లో ఉంది.