నీకోసం, ఆనందం, సొంతం, వెంకీ, అందరివాడు, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వేంకటేశ, దూకుడు, బాద్షా...ఇలా ప్రఖ్యాత డైరెక్టర్ శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన పదిహేడు సినిమాలలో ఒకట్రెండు తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్లే. కెరీర్లో అత్యధిక విజయాలను నమోదు చేసిన శ్రీను వైట్లకు పలు అవార్డులు కూడా వచ్చాయి. కొన్నాళ్ల క్రితం తన హిట్ సినిమా "ఢీ" కు సీక్వెల్ "ఢీ2" ను ఎనౌన్స్ చేసారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమాపై ఎలాంటి లేకపోవడంతో, ఆ సినిమా ఆగిపోయిందని అంతా అనుకుంటున్నారు.
తాజాగా శ్రీను వైట్ల తన పర్సనల్ లైఫ్ లో పలు ఒడిదుడుకులను ఎదుర్కుంటున్నారని తెలుస్తుంది. ఆయన భార్య రూప ఆయన నుండి విడాకులు కోరుతూ హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టును ఆశ్రయించిందట. గత నాలుగేళ్ళ నుండి విడివిడిగా జీవిస్తున్న వీరిద్దరూ, ఎట్టకేలకు విడాకులు తీసుకోవాలని నిర్ణయించున్నట్టు తెలుస్తుంది. వ్యక్తిగత జీవితం కారణంగానే శ్రీను వైట్ల ప్రొఫెషనల్ గా కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతున్నారని టాక్. అందుకే ప్రస్తుతం ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.
శ్రీను వైట్ల ప్రోద్బలంతో రూప ఫిలిం ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎదిగింది. దూకుడు, ఆగడు, బాద్షా సినిమాలలో సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లకు రూప ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసింది.