ట్యాలెంటెడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇటీవల బ్యాక్ టు బ్యాక్ లేడీ ఓరిటెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు సినిమాలలో ముందుగా విడుదలైన విరాటపర్వం కమర్షియల్ గా సక్సెస్ అవ్వనప్పటికీ సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు, విమర్శకులు జేజేలు పలికారు. తాజాగా విడుదలైన సోషల్ డ్రామా "గార్గి" లో కూడా సాయిపల్లవి అద్భుతమైన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఇక ప్రమోషన్లలో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు అస్సలు కోపం రాదని తెలిపింది. అయితే తాను పడుకున్నప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా లేపిన సమయంలో మాత్రం అరుదుగా కోపం వస్తుందని ఆమె వెల్లడించింది.