కోటి రూపాయలు విలువ చేసే డ్రగ్స్ సరఫరా చేస్తున్న మోడల్ శుభమ్ మల్హోత్రాను, అతడి మిత్రురాలు కీర్తి ని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. శుభమ్, కీర్తి హిమాచల్ నుంచి కారులో గంజాయిని స్మగ్లింగ్ చేసే వారని, గర్భిణి అని చెప్పి కీర్తి చెక్ పోస్టుల వద్ద పోలీసులను మభ్యపెట్టేదని తెలిపారు.