తమిళ సినీ పరిశ్రమలో సీనియర్ కమెడియన్ గౌండముని రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2000వ సంవత్సరం వరకు ఎన్నో సినిమాల్లో నటించి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తర్వాత సినిమాలను క్రమంగా తగ్గించేశారు. చివరిగా 2016లో వాయ్మ్ అనే సినిమాలో కనిపించారు. తాజాగా శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న 'మావీరన్' సినిమాలో నటించనున్నారు. దీనిపై హీరో స్వయంగా అభ్యర్థించడంతో ఓకే చెప్పారని ప్రచారం సాగుతోంది.