లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు కరోనా పాజిటివ్ అని, ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారన్న విషయం అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, డాక్టర్లు ఆయనకు టెస్ట్ చేస్తే కరోనా నెగిటివ్ అని వచ్చిందట...అంటే ఆయనకు కరోనా లేదు. తేలికపాటి జ్వరం, ఒళ్లునొప్పులు వంటి మైల్డ్ కరోనా లక్షణాలను కరోనా అని భయపడి, డాక్టర్స్ వద్దకు వెళ్లినట్టు తెలుస్తుంది. మణిరత్నం కు కరోనా లేదని తెలియడంతో, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనే, మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలాంటి ఆటంకం పడలేదని, అనుకున్న సమయానికి అంటే సెప్టెంబర్ 30వ తేదీన విడుదలవడం ఖాయమని సంబరాలు చేసుకుంటున్నారు.