సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నిరీక్షిస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ మూవీ ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లబోతుందని ఇటీవలే అధికారిక ప్రకటన జరిగింది. ఈ క్రమంలో ఫ్యామిలీ, రిలేటివ్స్ తో క్వాలిటీ టైం ను స్పెండ్ చేస్తున్నారు.
తాజాగా మహేష్ అండ్ ఫ్యామిలీ తన అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని పుట్టినరోజు వేడుకలకు హాజరై, కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంజాయ్ చేసారు. ఈ ఈవెంట్ కు మంజుల, సుధీర్ బాబు , ప్రియదర్శిని,గల్లా అశోక్ పాల్గొన్నారు. వీరందరితో కలిసి దిగిన సెల్ఫీ పిక్ ఒకటి మహేష్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయగా, కొన్ని నిముషాల్లోనే ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.