కమల్ హాసన్ - శంకర్ కాంబోలో,1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ "ఇండియన్" (తెలుగులో "భారతీయుడు") ను దాదాపు పాతికేళ్ళ తర్వాత సీక్వెల్ "ఇండియన్ 2" తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. కొంత షూటింగును పూర్తి చేసిన తర్వాత పలు కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దర్శకుడు శంకర్ కి, నిర్మాతలకు మధ్య తెలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ అండ్ ఈగో క్లాషెస్ ఇందుకు కారణమని తెలుస్తుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, శంకర్ కు, మేకర్స్ కు మధ్య ఉన్న డిఫరెన్సెస్ సర్దుమణిగాయని, త్వరలోనే ఇండియన్ 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం శంకర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక పాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ నాటికి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకోబోతుంది. ఆ వెంటనే అంటే డిసెంబర్ లోనే ఇండియన్ 2 సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారట శంకర్. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.