టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్లో తొలిసారి పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా నటించిన చిత్రం "ది వారియర్". కోలీవుడ్ డైరెక్టర్ ఎన్. లింగుసామి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కృతిశెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 14వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది.
ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ నుండి లేటెస్ట్ గా విజిల్ సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. దేవిశ్రీప్రసాద్ ఎనర్జిటిక్ మ్యూజిక్ కు, రామ్,కృతిలు ఎంత కష్టపడి మాస్ స్టెప్పులు వేసారో ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఈ పాటను ఆంథోనీ దాసన్, శ్రీనిష ఆలపించగా, సాహితి లిరిక్స్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.