ఇండియన్ సినిమా తీరు మారుతోంది. పాన్ ఇండియా సినిమాలు క్యూకడుతున్నాయి. సింగిల్ సినిమా కాదు. సిరీస్ లు వస్తున్నాయి. బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు రెండు భాగాలు వచాయి. ఇక బ్రహ్మాస మూడు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం "బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ" సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయాన్ ముఖరీ డైరెక్షన్ లో ఈ ఫాంటసీ అడ్వెంచర్ తెర కెక్కుతోంది. పార్ట్-1 లో రణ్ బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. అయితే పార్ట్ -2లో దీపికా పదుకొనె నటించనుంది. ఆమె పార్వతి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa