ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి కర్నూల్ షెడ్యూల్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 20, 2022, 11:27 AM

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ మూవీస్ బ్యానర్ వారు ఈ  సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజా షెడ్యూల్ ను కర్నూల్ లో ప్లాన్ చేశారు. రేపటి నుంచి ఈ సినిమా షూటింగు అక్కడ మొదలుకానుంది. 


కర్నూల్ తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. బాలకృష్ణ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను 'అఖండ' మాదిరిగానే డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా ఒక వార్త బయటికి వచ్చింది. 


ఆ తరువాత డిసెంబర్ చివరిలో విడుదల చేయనున్నారనే టాక్ వచ్చింది. కానీ మేకర్స్ డిసెంబర్ 2వ తేదీనే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. కథానాయికగా శ్రుతి హాసన్ .. ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa