సెలబ్రిటీల పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా తన పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ చాట్ చేస్తున్నారని ప్రముఖ సింగర్ గీతామాధురి వెల్లడించారు.
తన ప్రొఫైల్ పిక్ ఉన్న ఓ అమెరికా నెంబర్‌తో వాట్సాప్ మెసేజులు వస్తున్నాయని తెలిపారు. దయచేసి ఆ మెసేజ్‌లకు రెస్పాండ్ అవ్వద్దని అభిమానులను కోరారు. ఈ విషయాన్ని సైబర్ పోలీసుల దృష్టికి కూడా తీసుకెళుతున్నట్లు తెలియజేశారు.