బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లేటెస్ట్ మూవీ "ఎమర్జెన్సీ". పీరియడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ - డైరెక్షన్ కంగనానే చేస్తుంది.
ఇటీవలే ఈ మూవీ నుండి కంగనా ఫస్ట్ లుక్ విడుదలవగా, ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇందిరాగాంధీ రోల్ లో కంగనా స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచి, ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ మూవీలో జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ సీనియర్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసారు.
1975 - 1977 వరకు అంటే దాదాపు 21 నెలల పాటు సాగిన నిర్బంధం (ఎమర్జెన్సీ) లో ప్రపంచానికి తెలియని ఎన్నో నిజమైన సంఘటనలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. భూమిక చావ్లా కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రితేష్ షా డైలాగ్స్-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మణికర్ణికా ఫిలిమ్స్ బ్యానర్ పై కంగనా రనౌత్, రేణు పిట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో విడుదలవుతుంది.