పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే "లైగర్" సినిమాలో నటిస్తున విషయం అందరికి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ మరియు ముంబైలో ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో గ్రాండ్‌గా విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్‌కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో 50 మిలియన్లకు పైగా వీక్షణలను పొందగా, యూట్యూబ్ లో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. "లైగర్" సినిమా ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa