క్రియేటివ్ దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం "పుష్ప". గతేడాది విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్లా అనూహ్య విజయం సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ఒక సెన్సేషన్. పుష్ప సాధించిన విజయోత్సాహంతో పుష్ప 2 పనులు శరవేగంగా కానిచ్చేస్తున్నారు బన్నీ, సుకుమార్. ఈ సినిమాపై రోజుకొక కొత్త వార్త పుడుతూ, మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ గా ఉంటుంది.
పుష్ప సీక్వెల్ లో ఫాహద్ ఫాజిల్ కు సుపీరియర్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్పాయ్ కనిపించబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. ఐతే, ఈ వార్తలను పుకార్లని కొట్టి పారేసారు మనోజ్. పుష్ప లో నటించమని తననెవరూ అప్రోచ్ అవ్వలేదని తెలిపారు. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో సూపర్ పాపులరైన ఈ సీనియర్ హీరో పుష్ప లో భాగమైతే, రిజల్ట్ ఇంకా అదిరిపొద్దని పుష్ప అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa