ఇటీవల తెలుగులో విడుదలైన చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఆచార్య" ఒకటి. మెగాస్టార్ తో కలిసి రామ్ చరణ్ తొలిసారి ఎక్కువసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రమిది. కొరటాల శివ డైరెక్షన్లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలై, ఘోర పరాజయం పాలయ్యింది. చిరు కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అతి తక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిలిచింది. ఇప్పటికి ఆచార్య ఆర్ధిక ఇబ్బందులను కొరటాల ఫేస్ చేస్తూనే ఉన్నాడు.
లేటెస్ట్ గా అక్కినేని హీరో నాగచైతన్య నటించిన "థాంక్యూ" చిత్రం థియేటర్లలో విడుదలై, చైతు కెరీర్లో లోయెస్ట్ కలెక్షన్లను రాబడుతుంది. విడుదలైన రెండు, మూడ్రోజుల్లోనే ప్రేక్షకులు లేక కొన్ని షోలు క్యాన్సిల్ అయ్యాయట. చూస్తుంటే ఈ సినిమా మెగాస్టార్ "ఆచార్య"కు గట్టి పోటీనిస్తున్నట్టు కనిపిస్తుంది. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో తొలిస్థానంలో ఉన్న ప్రభాస్ "రాధేశ్యామ్" తదుపరి థాంక్యూ సినిమా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, థాంక్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువకే జరగడం వల్ల నష్టాలను దిల్ రాజు ఎదుర్కొనగలడని అంటున్నారు.