టాలీవుడ్ లో ఫీల్ గుడ్ మూవీస్ ను అందించే నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం "రాజమండ్రి రోజ్ మిల్క్". నాని బండ్రెడ్డి దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. జై, అవంతిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ సాంగ్ విడుదలైంది. అజయ్ అరసదా కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా, చంద్రబోస్ సాహిత్యమందించారు.
ఇంట్రోయూప్ ఫిలిమ్స్ బ్యానర్ తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. గోవింద్ వసంత్, యశ్వంత్ నాగ్, భరత్ సౌరభ్, అజయ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.