మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ". శరత్ మండవ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం జూలై 29న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
నాని మాట్లాడుతూ... ఇప్పటి తరానికి, తనలాంటి ఎంతోమంది సినీ నేపధ్యం లేని వారికి రవితేజ ఆదర్శం అని తెలిపారు. రవితేజ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనకిష్టమైన మెగాస్టార్ క్యారవాన్ లోకి వెళ్లే అవకాశం వచ్చిందని, తనకిష్టమైన రవితేజ క్యారవాన్ లోకి వెళ్లే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని, ఫ్యూచర్ లో తప్పకుండా వస్తుందని చెప్పుకొచ్చారు. అంటే, భవిష్యత్తులో వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశాలున్నాయన్న మాట.