సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే నటించిన యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ "అర్జున్ రెడ్డి". 2017 ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయ్యి అక్కడ కూడా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
తెలుగులో సూపర్ హిట్ ఐన అర్జున్ రెడ్డి ని సందీప్ రెడ్డి వంగా హిందీలో అద్భుతమైన మార్పులు చేసి అక్కడ కూడా ఘనవిజయం సాధించాడు. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో సినిమా చేసే గోల్డెన్ ఛాన్స్ ను కొట్టేసాడు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
అనిల్ మాట్లాడుతూ... సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో నటించడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమా కోసం ఆయనొక పవర్ఫుల్ సబ్జెక్టును రెడీ చేసారని, బాలీవుడ్ లో టాప్ రేంజుకు ఎదిగే సత్తా ఆయనకుందని చెప్పుకొచ్చారు.
ఒక అప్ కమింగ్ అదికూడా, సౌత్ డైరెక్టర్ పై సీనియర్ బాలీవుడ్ స్టార్ హీరో ఈ వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.