ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోనాల పండుగలో నిఖిల్ కార్తికేయ 2 టీం

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 25, 2022, 04:50 PM

భాగ్యనగరంలో మహంకాళి అమ్మవారి బోనాల పండగ జాతర ప్రతీ ఏడు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలానే ఈ ఏడాది కూడా జూలై 3 నుండి నిన్నటి వరకు నిర్విరామంగా, ఎంతో వైభవంగా జరిగిన ఈ పండుగలో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ కూడా పాల్గొన్నాడు.
చందూ మొండేటి డైరెక్షన్లో మిస్టికల్ ఎడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కాబోతుంది. ఈ మేరకు ఇటీవలే ఇస్కాన్ (కృష్ణుని జన్మస్థలం) పర్యటించి, కృష్ణుడి ఆశీస్సులు తీసుకున్న నిఖిల్ తాజాగా బోనాల పండగలో పాల్గొని, మహంకాళి అమ్మవారి ఆశీస్సులు పొందినట్టు తెలుస్తుంది. నిఖిల్ తో పాటు కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ఈ జాతరలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com