కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా, అనూప్ భండారి డైరెక్షన్లో రూపొందిన మూవీ "విక్రాంత్ రోణ". ప్రపంచవ్యాప్తంగా జూలై 28న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ను కొంచెంసేపటి క్రితమే మేకర్స్ ఎనౌన్స్ చేసారు.
ఈ మేరకు జూలై 26 వ తేదీన ఉదయం పదిగంటల నుండి హైదరాబాద్లోని పార్క్ హయత్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో నిరూప్ భండారీ, నీతా అశోక్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో రూపొందిన ఈ సినిమాను మేకర్స్ సుమారు 50దేశాలలో విడుదల చేయబోతున్నారు. జీ స్టూడియోస్, షాలిని ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.