నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త చిత్రం, తొలి హిస్టారికల్ మూవీ, కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ "బింబిసార". ఇన్ని ప్రత్యేకతలున్న బింబిసార గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి, ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇన్నాళ్ల ఎక్స్పీరియన్స్ గురించి తన మనోభావాలను తొలిసారి పంచుకోబోతున్నారు కళ్యాణ్ రామ్. ఈరోజు సాయంత్రం "అప్ క్లోజ్ విత్ NKR" పేరిట ఒక కార్యక్రమం జరగబోతుంది. అంటే ఈ కార్యక్రమం సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రోజు ఎపిసోడ్ 1 టెలికాస్ట్ కాబోతుంది.
కొత్త దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించిన ఈ టైం ట్రావెల్ సినిమాలో క్యాథరిన్ తెరెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.