కైకాల సత్యనారాయణ ... ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది విలక్షణ నటుల్లో ఒకరు. అలాంటి నటుడు టాలీవుడ్ కి చెందిన వారై ఉండడం తెలుగువారి గర్వ కారణం. "నవరస నటనా సార్వభౌమ" అనే ట్యాగ్ లైన్ కు పర్ఫెక్ట్ సూటబుల్ యాక్టర్.
లేటెస్ట్ గా కైకాల ఈ రోజు 87వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు కైకాల స్వగృహానికి వెళ్లి, ఆయన బర్త్ డే ను సెలెబ్రేట్ చేసారు. కొన్నాళ్ల నుండి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కైకాల, పూర్తిగా మంచానికే పరిమితమైనట్టు తెలుస్తుంది. బెడ్ మీద ఉండే చిరు తీసుకెళ్లిన కేక్ కట్ చేసారు. ఇద్దరు కలిసి ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ మేరకు కొన్ని ఫోటోలను మెగాస్టార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, కైకాల కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు.
మెగాస్టార్, కైకాల కలిసి ఎన్నో సినిమాలో నటించారు. వీరిద్దరి కాంబోకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, ఖైదీ 786 వంటి సూపర్ హిట్ సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు.