మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం "గాడ్ ఫాదర్". కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో, మలయాళ సూపర్ హిట్ మూవీ "లూసిఫర్" కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాధ్, బిజూ మీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సీనియర్ సల్మాన్ ఖాన్ కీరోల్ ప్లే చేస్తున్నారు.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ను తీసుకోవడానికి గల కారణాన్ని మెగాస్టార్ "లాల్ సింగ్ చద్దా" ప్రెస్ మీట్లో బయట పెట్టారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ సమర్పిస్తున్నారు. ఈ మూవీ ప్రెస్ మీట్లో ఆమీర్ మెగాస్టార్ ను "గాడ్ ఫాదర్ లో నన్ను కాకుండా, సల్మాన్ ను ఎందుకు తీసుకున్నారు?" అని అడగ్గా, చిరు వెంటనే "గాడ్ ఫాదర్ లో సల్మాన్ రోల్ బ్రెయిన్ అండ్ హార్ట్ కి సంబంధించింది కాదు కేవలం ఫిజికల్ ఫిట్నెస్ ... అందుకే సల్మాన్ ను తీసుకున్నాం" అని ఆన్సర్ ఇచ్చారు. దీనిని బట్టి లూసిఫర్ లో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో కానీ, పృథ్విరాజ్ పాత్రలో కానీ తెలుగులో సల్మాన్ నటించబోతున్నాడని తెలుస్తుంది.