కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న చిత్రం "మెర్రి క్రిస్మస్". కత్రినా చాలా కాలం తర్వాత చేస్తున్న సౌత్ సినిమా ఇది. అంతేకాక ఈ సినిమాతో కత్రినా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. శ్రీరామ్ రాఘవన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సౌత్ మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాధికా శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
గతేడాది నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం ముంబైలో కీలక షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ కి సంబంధించిన కొన్ని BTS పిక్స్ ను కత్రినా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇటీవలే కత్రినా 38వ పుట్టినరోజును జరుపుకుంది. ఆ రోజు తన ప్రెగ్నన్సీ గురించి ఎనౌన్స్ చేస్తుందని అంతా అనుకున్నారు కానీ, అలాంటి ప్రకటనేది కత్రినా చెయ్యలేదు.