బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం "పఠాన్". ఇందులో జాన్ అబ్రహం కీరోల్ ప్లే చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్. గన్ పట్టుకుని శత్రువుల గుండెల్లో బుల్లెట్ దింపే బులెట్ రాణిలా... దీపికా స్టన్నింగ్ లుక్ ఆకట్టుకుంటుంది. షారుఖ్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 25న విడుదలవబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.