బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ఐన కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ప్రముఖ డిస్నీ ప్లస్ ఓటిటిలో జూలై 7 నుండి స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, టెలివిజన్ హోస్ట్ అయిన కరణ్ జోహార్ తలపెట్టిన ఈ టాక్ షో 2004లో ప్రారంభమై 2019 వరకు స్టార్ వరల్డ్, స్టార్ వన్ ఛానెళ్లలో నిర్విరామంగా ప్రసారం చేయబడింది.
లేటెస్ట్ గా ఓటిటిలో మొదలైన సీజన్ 7 కు మూడవ ఎపిసోడ్ లో భాగంగా టాలీవుడ్ టాప్ సైరన్ సమంత, బాలీవుడ్ స్టార్ సీనియర్ అక్షయ్ కుమార్ తో కలిసి హాజరయ్యింది. ఈ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మోస్ట్ వ్యూడ్ షోస్ అండ్ మూవీస్ #1 పొజిషన్ లో దూసుకుపోతుంది. గత మూడు వారాల నుండి కూడా ఈ షో ఫస్ట్ పొజిషన్ లోనే ట్రెండ్ అవ్వడం విశేషం.