కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ రాఘవ లారెన్స్ డైరెక్షన్లో డార్లింగ్ ప్రభాస్ నటించిన చిత్రం "రెబల్". 2012 లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో మేజర్ హై లైట్ సీన్ లలో ఒకటి లేడీ ఫైటర్స్ తో ప్రభాస్ ఫైట్ చెయ్యటం. ఈ సీన్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
లేటెస్ట్ గా ఇదే ఫార్ములాను పూరి జగన్నాధ్ "లైగర్" సినిమాలో ఉపయోగించినట్టు తెలుస్తుంది. కొంతమంది లేడీ బాక్సర్లు లైగర్ ను దెబ్బతీయడానికి దొంగతనంగా ముట్టడిస్తారు. ఆ సమయంలో విజయ్ వాళ్ళతో చేసే ఫైట్ సినిమాకే మేజర్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
డైరెక్టర్ పూరి జగన్నాధ్, యంగ్ హీరో విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఇందులో బాలీవుడ్ అందం అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కాబోతుంది.