చియాన్ విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, త్రిష ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం "పొన్నియిన్ సెల్వన్". మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా పేర్కొంటున్న ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం PS 1 సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి, ఇటీవలే టీజర్ ను విడుదల చేసారు. దానికి ప్రేక్షకుల నుండి బిగ్ అప్లాజ్ వచ్చింది.
లేటెస్ట్ గా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. PS 1 ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల కాబోతుందని తెలుపుతూ, మ్యూజిక్ సిట్టింగ్స్ లో రెహ్మాన్ అండ్ టీం కష్టపడుతున్న వీడియోను షేర్ చేసారు.