ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, హాలీవుడ్ నటుడు నిక్ కానన్ 8వ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఇప్పటికే ఆయనకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. తాజాగా ఆయన భార్య, మోడల్ బ్రె టైసీ పండంటి మగబిడ్డకు సోమవారం జన్మనిచ్చింది. వీరిద్దరికీ ఇదే తొలి సంతానం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంట్లోనే సహజ ప్రవసమైందని, వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపింది. పలువురు ప్రముఖులు ఈ జంటకు విషెస్ తెలుపుతున్నారు.